బీసీల ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి ప్రాధాన్యతనిచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న శ్రీ ఎన్టీ రామారావుగారు బీసలకు రాజ్యాధికారం ఇస్తే.. ఈనాడు శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు బీసీలను ఆత్మవిశ్వాసంతో తలెత్తుకునేలా చేశారు. కులవృత్తులపై ఆధారపడ్డవారికి ఆదరణ పథకం ద్వారా ఉపాధిని కల్పించిన ఘనత చంద్రబాబుగారిదే. ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు అన్ని రకాలుగా అన్యాయం జరిగింది. బీసీ సబ్ ప్లాన్ కింద టీడీపీ రూ.35వేల కోట్లు ఖర్చు చేస్తే.. జగన్ 30 పైసలు కూడా ఖర్చు చేయలేదంటే బీసీలంటే జగన్ కు ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. అందరికీ ఇచ్చే పథకాలనే బీసీలకు ఇచ్చినట్లు చూపిస్తున్నారే తప్ప వైసీపీ ప్రభుత్వం బీసీలకు ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. బీసీలకు అడుగడుగునా అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వంలోని బీసీ మంత్రులకు ప్రశ్నించే ధైర్యం లేదు. పదవుల కోసం చంద్రబాబుని, పవన్ కల్యాణ్ ని, టీడీపీ, జనసేన పార్టీలను తిట్టడం తప్ప తమ కులానికి ఏం చేశారో చెప్పగలిగే సత్తా ఈ మంత్రులకు లేదు. మెడికల్ సీట్లలో బీసీ విద్యార్థులు నష్టపోతున్నా బీసీ సంఘాలు ప్రశ్నించలేకపోతున్న పరిస్థితులు ఈ ప్రభుత్వంలో ఉన్నాయి. పొన్నూరు నియోజకవర్గంలో కార్పొరేషన్ రుణాలిచ్చాం, ఆదరణ పథకం కింద నిధులిచ్చాం, 30 కమ్యూనిటీ హాళ్లు మంజూరు చేస్తే వైసీపీ చేసింది శూన్యం. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు గారు, పవన్ కల్యాణ్ గారు చేతులు కలిపి ముందుకెళ్తున్నారు. టీడీపీ-జనసేన పొత్తు స్వార్థం కోసం కాదు ఈ రాష్ట్రంలో ఉన్న బడుగులు, అణగారిన వర్గాల కోసం. బీసీలంతా ఏకమై వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలి. టీడీపీ-జనసేన ప్రజాప్రభుత్వ స్థాపనలో కీలకపాత్ర పోషించాలి.

“జయో బీసీ..! జై తెలుగుదేశం..!”

 
 

పొన్నూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఉదయం మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు సిబ్బందితో సమీక్ష సమావేశం

పొన్నూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఉదయం మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది• గత…

వైసీపీ విధ్వంసానికి వందరోజులు..! చేతగాని ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం.!

అభివృద్ధి అంటే ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి.. అభివృద్ధి అంటే జనం ఆమోదం పొందేలా ఉండాలి. అభివృద్ధి అంటే విధ్వంసం కాదు..!…

నూతన సంవత్సరంలో అభివృద్ధి – సంక్షేమమే మా లక్ష్యంగా మా అడుగులు

నూతన సంవత్సరంలో అభివృద్ధి – సంక్షేమమే మా లక్ష్యంగా మా అడుగులు 16 నెలల ప్రజా పాలనలో సాధించిన ముఖ్య ఫలితాలకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This field is required.

This field is required.