రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాట్రంలోని అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు, నమ్మకద్రోహానికి, నయవంచక పాలనకు ఈ రాష్ట్రంలోని మైనార్టీ సోదరులు బలైపోతున్నారు. చదువుకునే పిల్లల నుంచి కుటుంబాలతో సహా ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది. ధూళిపాళ్ళ కుటుంబానికి పొన్నూరులోని ముస్లింల కుటుంబాలకు తరతరాల అనుబంధం ఉంది. మా తండ్రిగారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మైనారిటీల చేయి వదలకుండా వారికోసమే పోరాడారు. నేను నా తండ్రి రాజకీయాన్ని వారసత్వంగా తీసుకోలేదు.. ఆయన ఆశయాలనే వారసత్వంగా తీసుకున్నా..! ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజల చేయి వదిలిపెట్టే ప్రసక్తే లేదు..!

తాను అధికారంలో లేకపోయినా బాబ్రీ మసీదు ఘటన సమయంలో అధికార పార్టీ నాయకులు ముస్లింల ఇళ్లపై పడితే స్వయంగా ఆయనే అడ్డుగా నిలబడి ముస్లింల కుటుంబాలను కాపాడిన వ్యక్తి వీరయ్య చౌదరిగారు. నేను నా తండ్రి రాజకీయాన్ని వారసత్వంగా తీసుకోలేదు.. ఆయన ఆశయాలనే వారసత్వంగా తీసుకున్నా. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే బాబ్రీ మసీదు ఘటనల కేసులో ఉన్న యువకులను విడిపించాను. నేను రాజకీయ నాయకుడిని కాదు ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని.. నా తండ్రి ఆశయాలకు వారసుడిని..

గత 25 ఏళ్లలో ఎన్నో రోడ్లు వేశాం, ముస్లింల కోసం షాదీ ఖానాలు కట్టించాం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత షాదీ ఖానాకు ఇటుక కూడా వేయలేదు. మాట్లాడితే చందాలు వసూలు చేసి పబ్లిసిటీ చేసుకుంటారు తప్ప పనులు చేయడం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 7వేల మంది విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇచ్చాం. అర్బన్ హౌసింగ్ కింద అడిగిన వారందరికీ ఇళ్లు కేటాయించాం. 25 గ్రామాలకు 15లక్షల చొప్పున నిధులతో ముస్లింలకు ఖరబస్థాన్ లు కట్టించాం.

టీడీపీ హయాంలో ఉర్దూ టీచర్ పోస్టులను ఓపెన్ కేటరిలోకి తీసుకొచ్చి ముస్లింలకే ఉద్యోగాలు వచ్చేలా చేశాం. 4ఏళ్ల 10 నెలల వైసీపీ పాలనలో ఒక్క మైనారిటీ సోదరుడికైనా ఉద్యోగం వచ్చిందా..? ముస్లింలకు బార్ షాపుల్లో లెక్కలు రాసే ఉద్యోగాలిచ్చాడు తప్ప ప్రభుత్వ ఉద్యోగాలివ్వలేదు.

నా 25ఏళ్ల రాజకీయ చరిత్రలో నలుగుర్ని బ్రతికించే ప్రయత్నంచేశాను తప్ప ఒక్కరి కడుపు కొట్టే ప్రయత్నం చేయలేదు. మోసం చేయడం నా రక్తంలో లేదు.. నా తండ్రి ఇచ్చిన ధైర్యం నా వెంట ఉంది . నన్ను మోసం చేసిన వారికి సైతం సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉంటా..! నాకు కావాల్సిన ప్రజల అభిమానమే.. ఉన్నది ఉన్నట్లు చెప్పిన విధానం నా తండ్రి నేర్పింది. కష్టం వచ్చిన వాడి చేయి వదలని తత్వం నా తండ్రి నుంచి వచ్చినదే.

రేషన్ మాఫియా ఓ మైనార్టీ సోదరుడిని చంపేసి డబ్బులిస్తే సరిపోతుందా..? చేబ్రోలులో ఇళ్ల మధ్య లిక్కర్ షాపు తీసేయాలని కోరిన మైనార్టీ సోదరుడిని చంపిన వ్యక్తులు బెయిల్ పై తిరుగుతున్న పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. వైసీపీలో తిరిగే మైనార్టీ నాయకుడే తన కొడుకు మరణంపై ప్రభుత్వాన్ని అనుమానించాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

పొన్నూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఉదయం మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు సిబ్బందితో సమీక్ష సమావేశం

పొన్నూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఉదయం మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది• గత…

నూతన సంవత్సరంలో అభివృద్ధి – సంక్షేమమే మా లక్ష్యంగా మా అడుగులు

నూతన సంవత్సరంలో అభివృద్ధి – సంక్షేమమే మా లక్ష్యంగా మా అడుగులు 16 నెలల ప్రజా పాలనలో సాధించిన ముఖ్య ఫలితాలకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This field is required.

This field is required.