మిచౌంగ్ తుపాను బాధిత రైతులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వానికి అలసత్వం ఎందుకు..? రోజుల తరబడి పంటలు నీటిలోనే ఉన్నా అధికారులు ఎందుకు రాలేదు..? పొన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగితే ప్రభుత్వం కనీసం కన్నెత్తి చూడకపోవడం బాధాకరం.
సరిగ్గా పంటలు చేతికి వచ్చే సమాయానికి తుపాను రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా కౌలు రైతులు ఎకరాకు రూ.30వేల కౌలుతో పాటు రూ.35వేల నుంచి రూ.45 వేల వరకు పెట్టుబడిని కూడా కోల్పోయారు. అధికారులు పొలాల్లోకి వచ్చి నష్టాన్ని నమోదు చేసుకోకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి ప్రతి ఎకరాకు నష్టపరిహారం చెల్లించకపోయినా, నష్టపోయిన రైతుల పేర్ల నమోదులో అవకతవకలకు పాల్పడినా రైతులు సరైన సమయంలో బుద్ధి చెప్తారు.




