అభివృద్ధి అంటే ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి.. అభివృద్ధి అంటే జనం ఆమోదం పొందేలా ఉండాలి. అభివృద్ధి అంటే విధ్వంసం కాదు..! అభివృద్ధి అంటే అధికార పార్టీ పెత్తనం కాదు. చేతగాని ప్రభుత్వ పాలనలో.. చేవచచ్చిన ఎమ్మెల్యే పెత్తనంతో ప్రశాంతంగా ఉండే పొన్నూరులో విధ్వంస రాజకీయకీయాలను ఎప్పుడైనా చూశామా..? యథా సీఎం.. తథా ఎమ్మెల్యేలు అనే చందంగా.. చేతగాని సీఎం రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే.. మరోవైపు చేతగాని ఎమ్మెల్యే పొన్నూరు విధ్వంసానికి కంకణం కట్టుకున్నారు. ఎంతో చరిత్రగలిగిన, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే పొన్నూరుకు బిజినెస్ సెంటర్ గా ఉన్న జీబీసీ రోడ్డు విస్తరణ పేరుతో దశాబ్దాలుగా వ్యాపారాలు చేసుకుంటున్న షాపులు, ప్రజలు నివాసం ఉంటున్న ఇళ్లను అక్రమంగా కూల్చేసి జీవితాలను రోడ్డున పడేసిందీ వైసీపీ ప్రభుత్వం.
అభివృద్ధిని ఎవరూ వ్యతిరేకించరు.. కానీ దానికంటూ ఓ విధానం ఉంటుంది. అభివృద్ధి పనులంటే భూసేకరణ అంతే హుందాగా జరగాలి.. అది చేస్తాం.. ఇది చేస్తామంటూ రాష్ట్రాన్ని ముంచేసిన సీఎం మాదిరిగానే.. జీబీసీ రోడ్డు విషయంలో స్థానిక ఎమ్మెల్యే అరచేతిలో వైకుంఠం చూపించి తీరని అన్యాయం చేశారు. పరిహారానికి సంబంధించిన బాండ్లు కూడా చూపకుండా అధికార మదంతో భవనాలను కూల్చివేయడానికి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.
జీబీసీ రోడ్డు విస్తరణ బాధితులకు న్యాయం జరిగేవరకు.. బాధితులకు అండగా ఉంటాం..! అన్యాయంగా నష్టపోయిన వారికి తగిన పరిహారం అందేవరకు.. ఎమ్మెల్యేపైనా, ఈ సైకో ప్రభుత్వంపైనా పోరాడుతూనే ఉంటాం..!

పొన్నూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఉదయం మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు సిబ్బందితో సమీక్ష సమావేశం

పొన్నూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఉదయం మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది• గత…

తెలుగుదేశంతోనే బీసీలకు ఆత్మగౌరవం, రాజ్యాధికారం

బీసీల ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి ప్రాధాన్యతనిచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న శ్రీ ఎన్టీ రామారావుగారు బీసలకు రాజ్యాధికారం ఇస్తే.. ఈనాడు…

జగన్ రెడ్డి అండతో సాగుతున్న గ్రావెల్ మాఫియాపై ప్రజాపోరాట యాత్ర..!

రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో ప్రకృతి వనరుల దోపిడీ యదేచ్చగా కొనసాగటం వైకాపా దోపిడీ కార్యక్రమానికి ప్రత్యక్ష నిదర్శనమం. ఏళ్ల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This field is required.

This field is required.