
జయహో బీసీ – Jaiho BC
by
238 238 people viewed this event.
రాష్ట్రంలో దాదాపు 142 కులవృత్తులలో నిమగ్నమై ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తోడ్పాటునిస్తున్న బీసీల కోసం నాడు స్వర్గీయ ఎన్టీఆర్ గారు, నేడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు నిరంతరం శ్రమిస్తున్నారు. అలాంటిది గత 4 సంవత్సరాల 10నెలల కాలంలో రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం.. బీసీలను చులకనగా చూస్తూ.. వారిపై అరాచకాలు కొనసాగిస్తూ.. వారితో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోంది. బీసీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించడమే కాకుండా.. వారికున్నస్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించింది. సంక్షేమ పథకాల్లో కోత విధించడమే కాకుండా.. వైసీపీ మూకలు బీసీ సోదరులపై అకృత్యాలకు పాల్పడతూ ప్రాణాలను తీస్తున్నాయి. అలాంటి అహంకారపూరిత చర్యలను ప్రశ్నించేందుకు, బీసీలకు భరోసానిచ్చేందుకు జయహో బీసీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
