
జగన్ రెడ్డి అండతో సాగుతున్న గ్రావెల్ మాఫియాపై ప్రజాపోరాట యాత్ర..!
by
381 381 people viewed this event.
అభివృద్ధిలో పరుగులు పెట్టాల్సిన పొన్నూరు నియోజకవర్గం.. సహజ వనరుల దోపిడీతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. కేడీఎఫ్ ను తలదన్నేలా.. ఓబుళాపురం గనులను అధిగమించేలా సాగుతున్న గ్రావెల్ దోపిడీ చూస్తే షాక్ అవడం ఖాయం. ఓవైపు పథకాలంటూ ప్రజలను వంచిస్తూనే మరోవైపు లక్షలాది టన్నుల గ్రావెల్ దోపిడీ సాగిస్తూ విధ్వంస రచన చేస్తోందీ వైసీపీ సర్కార్. గ్రావెల్ మాఫియా నుంచి పొన్నూరు నియోజకవర్గాన్ని రక్షించుకునేందుకు ప్రజాపోరాటయాత్రను చేపట్టడం జరిగింది. ఈ ప్రజాపోరాట యాత్ర ద్వారా అధికార పార్టీ సాగిస్తున్న విధ్వంసం బయటి ప్రపంచానికి తెలిసింది.
