గ్రావెల్ మాఫియాపై ప్రజాపోరాట యాత్ర – Gravel Mafiapai Praja Porata Yatra

గ్రావెల్ మాఫియాపై ప్రజాపోరాట యాత్ర – Gravel Mafiapai Praja Porata Yatra

by
419 419 people viewed this event.

 

రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో ప్రకృతి వనరుల దోపిడీ యదేచ్చగా కొనసాగటం వైకాపా దోపిడీ కార్యక్రమానికి ప్రత్యక్ష నిదర్శనమం. ఏళ్ల తరబడి కాపాడుకుంటూ వస్తున్న ఖనిజ సంపదను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సహకారంతో పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య దోచేస్తున్నాడు. పొన్నూరు నియోజకవర్గంలో గత నాలుగున్నరేళ్లలో రూ.2100 కోట్ల విలువైన గ్రావెల్ దోచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య భాగస్వామ్యంతో గ్రావెల్ దోపిడీ యథేచ్చగా సాగుతోంది. 700 ఎకరాల్లో సుమారు 125 కోట్ల టన్నుల గ్రావెల్ దోపిడీ చేసి వేలకోట్లు అక్రమంగా దోచుకున్నారు.
అక్రమ గ్రావెల్ తవ్వకాలపై ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు అర్జీలు పెట్టినా, బాధిత గ్రామ ప్రజలు పోరాటాలు చేసినా ప్రభుత్వం నుంచి లేకుండా పోతోంది. గ్రావెల్ మాఫియాకు ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉండటమే అసలు కారణం. తమ పోరాటంతో ఇప్పటివరకు ఎమ్మెల్యే కిలారిని ఇంటికి పిలిపించుకున్న సీఎం జగన్ వాటాలు మాట్లాడుకున్నారే తప్ప సహజ వనరుల దోపిడీని అరికట్టలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు కప్పం కట్టించుకోవడానికి తప్ప నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియాను ఆదుపు చేయదానికి కాదు. పర్యావరణం పాడైపోతున్నా ,పొలాలు నిస్సారంగా మారుతున్నా, భూగర్భ జలాలు కలుషితమవుతున్నా పట్టించుకొనే దిక్కులేకుండా పోవటం భాధాకరం.

To register for this event please visit the following URL:

 

Date And Time

-
 

Location

 

Event Types

Share With Friends